Thursday, November 6, 2008

Bathukamma Geyamu(బతుకమ్మ గేయము)

నీవా బతుకమ్మవు ఎవరమ్మా నువ్వు.
ఎన్నో వెతలను బాపి అందితువు నవ్వు.
నీవు కావద్దమ్మా ఎన్నడు వాడి పోయిన పువ్వు.
దోసిలిలో మల్లె చెండులా కాలమును రువ్వు.

ఎన్ని కాలాలు మారినా నిజాములంతరించినా
పోరులెన్ని మారినా ఉద్యమాలంతరించినా
నిన్ను బతికించుకొన్నానే బతుకమ్మా
నా గుండెలో గుండెదడలో నిన్నుంచుకున్నా

నా పల్లె వాకిటిలో నా చెల్లి నుదుటి బొట్టులొ
నా పెరటి మల్లె పొదలో ఉన్నది నీవే బతుకమ్మా
బొగ్గు బాయిల్లలొ బుగ్గయ్యే అన్నలకు
ఎక్కడెక్కడికో పోయె వలస తమ్ముళ్ళకు
దుబాయ్యిలో అందరిని బాసి మగ్గిపోతున్నోళ్ళకు
ఆశ నీవే బతుకు మీద పెరాశే నీవు

కలిమిలేములలో పూరిగుడిసెలల్లొ
పున్నమి వెలుగులొ నాలగడవి పూలు దొరికినా చాలు
నాకానాడు బతుకమ్మ పండుగ
ఎంత కమ్మని పేరు నీది బతుకమ్మా

అందరినిని చల్లగా బతికించుకొందువు
పిల్లాదివారలను మురిపించుకొందువు
ఎల్లలు దాటి కల్ల కాకుండా జరిపించుకొందువు
నేలలు నెర్రలు కొట్టి నాగలి కర్రు మొరాయించినప్పుడు నా రైతన్న చెమటలె చేమంతి బతుకమ్మా
ఆ ఇల్లాలి పాదపు పర్రెల్లొ పగలబడి నవ్వమ్మా

తెలంగాణలొ అమ్ముడు పొయిన భూముల్లో తెల్లగా పాలిపొయిన నవ్వు విసరకమ్మా
లొల్లితొ ఎగతాళి చేసినా వారికేమి తెలుసు
బతుకమ్మంటే తెలంగాణ జనమూపిరని గుండె దడ అని
అట్లా ఇట్లా కాదు బతుకమ్మా చెట్లా పుట్లా కాదు బతుకమ్మా
పాట్లు ఎన్ని పడ్డా పక్కున నవ్వేది బతుకమ్మా
ఈనాటికి ఈవు సాక్షివమ్మా!

No comments: